పవర్‌‌‌‌ ప్లాంట్​ఏర్పాటుతో రామగుండానికి మళ్లీ వెలుగులు : ఎంఎస్​ రాజ్‌‌ఠాకూర్​

 పవర్‌‌‌‌ ప్లాంట్​ఏర్పాటుతో రామగుండానికి మళ్లీ వెలుగులు : ఎంఎస్​ రాజ్‌‌ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: రామగుండంలో మూసివేసిన 62.5 మెగావాట్ల జెన్​కో ప్లాంట్​ స్థానంలో 800 మెగావాట్ల సూపర్​ క్రిటికల్​పవర్​ప్లాంట్‌‌ను ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మళ్లీ వెలుగులు వస్తాయని ఎమ్మెల్యే ఎంఎస్​రాజ్‌‌ఠాకూర్​ తెలిపారు. ఆదివారం క్యాంప్​ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ రామగుండంలో 800 మెగావాట్ల పవర్​ప్లాంట్​సాధనకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ సలహాదారు సహకారం మరువలేనిదన్నారు.

 పవర్‌‌‌‌ ప్లాంట్‌‌ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం ప్రకటనతో ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్ల కల నెరవేరిందన్నారు. అలాగే నెలరోజుల్లో సింగపూర్‌‌‌‌కు చెందిన ఓ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ సంస్థ రామగుండంలో స్కిల్​డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేయనుందని ప్రకటించారు. బండలవాగు ప్రాజెక్ట్​కు రూ.10 కోట్లు, పాలకుర్తి లిప్ట్​కు రూ.350 కోట్లు కేటాయించడానికి ప్రభుత్వం ఓకే చెప్పిందన్నారు. మీటింగ్‌‌లో మేయర్‌‌‌‌ అనిల్‌‌కుమార్‌‌, లీడర్లు బొంతల రాజేశ్, మహాంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, మారెల్లి రాజిరెడ్డి పాల్గొన్నారు.