రామగుండం అభివృద్ధికి కృషి : ఎంఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. గురువారం స్థానిక మార్కండేయకాలనీలో ఇంటర్‌‌‌‌‌‌‌‌ డినామినేషనల్‌‌‌‌‌‌‌‌ ఫాస్టర్స్‌‌‌‌‌‌‌‌ ఫెలోషిప్‌‌‌‌‌‌‌‌ (ఐపీఎఫ్‌‌‌‌‌‌‌‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రైస్తవులకు కావలసిన క్రైస్తవ భవన్, పాస్టర్లకు గౌరవం వేతనం.. తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఐపీఎఫ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ ఎం.ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ తేజస్విని, ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, జి.థామస్‌‌‌‌‌‌‌‌, కె.లాజరస్‌‌‌‌‌‌‌‌, పి.ఇజ్రాయేలు, ఎం.మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.