జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్తరణకు కృషి : ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు : పట్టణంలోని జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విస్తరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. శుక్రవారం రామగుండం జెన్ కో పవర్ ప్రాజెక్టును ఎమ్మెల్యే సందర్శించారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మాజీ మంత్రి, దివంగత జి.వెంకటస్వామి, మంత్రి శ్రీధర్ బాబు జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడానికి కృషి చేశారని పేర్కొన్నారు.

ఇక్కడ అన్ని రకాలుగా వనరులు ఉన్నా రామగుండంలో ప్రాజెక్టు నిర్మించకుండా యాదాద్రిలో గత  ప్రభుత్వం   నిర్మించిందన్నారు.  రానున్న రోజుల్లో రామగుండం జెన్ కో పవర్ ప్రాజెక్టును విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 46వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.20 లక్షలతో చేపట్టిన అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ, కల్వర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి,ఎల్లయ్య, మహంకాళి స్వామి, ఆఫీసర్లు పాల్గొన్నారు.