గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్ సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, ఇందులో భాగంగానే టౌన్‌లోని జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్తెలిపారు. శుక్రవారం గోదావరిఖనిలోని తిలక్‌నగర్ జంక్షన్ వెడల్పు కోసం భూమిపూజ చేశారు. అడ్డుగా ఉన్న సింగరేణి క్వార్టర్లు, పలు దుకాణాలను కూల్చివేయగా ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మట్టిని చదును చేశారు. జంక్షన్ల వెడల్పుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
ప్రజలంతా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సహకరించాలని కోరారు. అనంతరం విఠల్ నగర్ పార్క్ వద్ద, పరుశురామ్‌నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద రూ.20 లక్షల సింగరేణి నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌వో వాటర్ప్లాంట్లను మేయర్ అనిల్‌కుమార్, జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో లీడర్లు ఆరెల్లి పోచం, రాంమోహన్, కిరణ్‌బాబు, మహాంకాళి స్వామి, బొంతల రాజేశ్, పెద్దెల్లి ప్రకాశ్, శ్రీనివాస్, రజిత, రవీందర్, మౌనిక, రాజు, ఆంజనేయ ప్రసాద్, కర్ణ పాల్గొన్నారు.