గోదావరిఖని, వెలుగు : కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సింగరేణిని పెట్టుబడిదారులకు అమ్మేస్తారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో సీపీఎం లీడర్లతో కలిసి ప్రెస్మీట్నిర్వహించారు. అనంతరం జీడీకే 2వ గని, సీహెచ్‌పీ, సింగరేణి ఏరియా హాస్పిటల్, కుందనపల్లి ప్రాంతాల్లో కార్మికులతో మీటింగ్‌లు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్నే మారుస్తారన్నారని ఆరోపించారు.కేసీఆర్ తన కూతురు కవిత అరెస్ట్‌తో బీజేపీకి సరెండర్ అయ్యారన్నారు.
సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు రూ.450 కోట్ల రుణాన్ని ఇప్పించి.. కాకా కార్మికుల ఉద్యోగాలు పోకుండా ఆదుకున్నారన్నారు. కాకా కుటుంబం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పాలకుర్తి మండలం కొత్తపల్లిలో ప్రచారం నిర్వహించారు.
గడ్డం వంశీకృష్ణకు సంపూర్ణ మద్దతు
గడ్డం వంశీ కృష్ణకు సీపీఎం తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు పార్టీ జిల్లా కార్యదర్శి యాకయ్య, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి తెలిపారు.