గోదావరిఖని, వెలుగు: రామగుండం పట్టణాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. శుక్రవారం 26వ డివిజన్ అడ్డగుంటపల్లి, సాధనానగర్, దుర్గానగర్, మార్కండేయకాలనీ, , వెంకటేశ్వరకాలనీ, శివనగర్, కేశవ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 26వ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. కాలువలు, రహదారులను ఆక్రమణలను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం మార్కండేయ కాలనీలో నిర్వహించిన సభలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం వన మహోత్సవం మొక్కలు పంపిణీ చేశారు. అంతకుముందు సింగరేణి ఆర్జీ 2 ఏరియా పరిధిలోని ఓసీ 3లో నిర్వహించిన బోనాల వేడుకులకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతులు హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట మేయర్ బి.అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, కార్పొరేటర్లు దయాకర్, మహంకాళి స్వామి, రాజేశ్, ముస్తాఫా ఉన్నారు.