గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టూర్‌ను సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో జరగనున్న బహిరంగ సభా వేదిక ప్రాంతాన్ని, రామగుండం జెన్కో ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10.30 గంటలకు హెలీక్యాప్టర్ పోలీస్ హెడ్ క్వార్టర్‌కు డిప్యూటీ సీఎం చేరుకొని రామగుండంలోని బి-థర్మల్ ప్లాంట్‌ను విజిట్ చేస్తారని, అక్కడి నుంచి సింగరేణి మేడిపల్లి ఓసీపీలో నిర్మించాలని ప్రతిపాదించిన పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలిస్తారని తెలిపారు.
అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని చెప్పారు. కాగా డిప్యూటీ సీఎం రాక సందర్భంగా చేపట్టాల్సిన బందోబస్త్‌పై రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ఆఫీసర్లతో చర్చించారు.