ఎంపీ వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలి : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

ఎంపీ వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలి : ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకాంక్షించారు. సోమవారం వంశీకృష్ణ బర్త్‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా గోదావరిఖనిలోని క్యాంప్​ ఆఫీస్​లో కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్​ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే , లయన్స్​ క్లబ్​ అధ్యక్షుడు పి.మల్లికార్జున్​ కేక్​ కట్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకా కుటుంబం కొన్నేండ్లుగా ప్రజాసేవలో కొనసాగుతోందని, వేలాదిమంది నిరుద్యోగులు, పేదలకు సేవలందిస్తున్నారని కొనియాడారు. వంశీకృష్ణ  కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ మరింత సేవ చేయాలని కోరారు. 

రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉచిత అల్పాహార వితరణ చేశారు. యువ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని అనాథ పిల్లల అమ్మ పరివార్ ఆశ్రమంలో కేక్ కట్ చేసి ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు, బియ్యం అందజేశారు. చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. మాలమహానాడు ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో లయన్స్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌ జోన్ చైర్మన్ కె.రాజేందర్, ట్రెజరర్​ పాకాల గోవర్ధన్ రెడ్డి, లీడర్లు కుమారస్వామి, బాలరాజు, మల్లేశ్‌‌‌‌‌‌‌‌యాదవ్​, కోటేశ్వర్లు, మధు, కల్వల సంజీవ్​, దీపక్​ పాల్గొన్నారు.