మహబూబాబాద్ అర్బన్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యంపై డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు హెచ్చరించారు. గురువారం రూ.50 లక్షలతో డయాలసిస్, ఎన్సీడీ వైద్యసేవలతోపాటు మార్చురీలో ఫ్రీజర్ బాక్స్ ను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకన్న, సూపరింటెండెంట్ శ్రీనివాస్, డయాలసిస్ ఇన్చార్జి డాక్టర్ శ్రీనివాస్, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవ్ రెడ్డి, మహబూబాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ మదన్ లోయ తదితరులున్నారు.