ఇంజనీరింగ్​​ కాలేజీని పరిశీలించిన ఎమ్మెల్యే మురళీనాయక్

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంజనీరింగ్ కళాశాలను ఎమ్మెల్య మురళీనాయక్​ ఆకస్మిక తనిఖీచేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

హాస్టల్లో ఉన్న వసతులు, సమస్యలను  అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే  కఠిన చర్యలు తప్పవని ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యానికి హెచ్చరించారు.  విద్యార్ధులకు వచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని క్రమశిక్షణతో ఉండాలని సూచించారు

ALSO READ : కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే : సంకినేని వెంకటేశ్వరరావు