
జనగామ/బచ్చన్నపేట, వెలుగు : ‘ఎన్నికలు వస్తున్నాయి... ఇచ్చినోళ్ల దగ్గర తీసుకోండి.. ఓటు మాత్రం ఏసేటోళ్లకే వేయండి’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చెప్పారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఆర్‌ఎంపీ డాక్టర్ల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు వేదికలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు బీఆర్‌ఎస్ సర్కార్ అమలు చేస్తోందన్నారు. కేసీఆర్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ విశాలాక్ష్మి, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ఇర్రి రమణారెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, సర్పంచ్ మల్లారెడ్డి పాల్గొన్నారు. అలాగే జనగామ శివారులోని భ్రమరాంబ ఫంక్షన్‌లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవానికి హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకు పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.