పనికిమాలిన చట్టాన్ని మార్చాలె: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

పనికిమాలిన చట్టాన్ని మార్చాలె: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

అడవి పందులను చంపే హక్కు రైతులకే ఇయ్యాలె

జనగామ, వెలుగు: పంట నష్టం కలిగిస్తున్న అడవి పందులను చంపి అవ్వల్ దర్జాగా ఊర్లల్లో పోగులేసుకుని తినే హక్కు రైతులకే ఇయ్యాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. పనికిమాలిన ఫారెస్టు చట్టాన్ని మార్చాలని కోరారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ​చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తుంటే అడవి పందులు వచ్చి నష్టం చేస్తున్నాయని అన్నారు. గవర్నమెంట్​ నుంచి ఈ పందులను చంపే లైసెన్స్​పొందినోళ్లు వాళ్లకు తినాలనిపించినప్పుడు వచ్చి చంపి పట్టుకెళ్తున్నారని అన్నారు. పందులు వచ్చి చేన్లను ఆగం జేస్తుంటే చంపకుండా అటవీ శాఖకు దరఖాస్తు చేయాలని, లైసెన్స్​ తీసుకున్నోళ్లు వచ్చి చంపుతారని ఫారెస్టోళ్లు అనడం సరికాదన్నారు.  వాళ్లు వచ్చేసరికి పంటలు చేతికి రాకుండా పోతాయని, అందుకే పనికిమాలిన చట్టాన్ని మార్చాలని డిమాండ్​ చేశారు. పందులను చంపిన రైతులు ఒక్కో పందికి రూ 25 వేలు కట్టాలట.. పైగా లక్ష రూపాయలు లంచం ఇయ్యాల్నట.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. అనంతరం జనగామ మండలంలోని 148 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్​ చెక్కులను అందజేశారు.

For More News..

బతుకమ్మ పండుగ ఎన్నడు చేసుకోవాలె?

ఢిల్లీ అల్లర్ల కేసులో సీతారాం ఏచూరి

మూడెకరాల స్కీమ్‌‌కు ఫుల్ స్టాప్​ పెట్టిన కేసీఆర్