బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆయన కూతురు తుల్జా భవానీల భూ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూన్ 30వ తేదీ శుక్రవారం కూతురు, అల్లుడి వేధింపులపై హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. తన కూతురు, అల్లుడిపై న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేశారు. తన ప్రజాజీవితం, చట్టబద్దమైన కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. తరచుగా నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు, ప్రజా సేవాకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే కార్యక్రమాలకు అడ్డుతగలకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ, స్థానిక పోలీసు అధికారులను హైకోర్టు ఆదేశించింది. చేర్యాల భూవివాదంలో ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని ప్రహరీ గోడ కూల్చి తండ్రిని రోడ్డుకు ఈడ్చిన విషయం తెలిసిందే.