
- పల్లా పార్టీని ధిక్కరించిండు
- జనగామలో వర్గాలను ప్రోత్సహిస్తున్నడు: ముత్తిరెడ్డి
- ఎమ్మెల్యే లేకుండా నియోజకవర్గ ప్రజలతో మీటింగ్ పెట్టడంపై అభ్యంతరం
జనగామ, వెలుగు : జనగామ నియోజకవర్గ కార్యకర్తలతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిడిగొండలో మీటింగ్‌పెట్టి పార్టీని ధిక్కరించాడని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. గతంలో మీటింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటే అధిష్టానం మందలించడంతో వెనుదిరిగాడని మళ్లీ ఇప్పుడు అక్కడే మీటింగ్‌పెట్టి తప్పు చేశాడని, దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో శనివారం సాయంత్రం ముత్తిరెడ్డి నియోజకవర్గ లీడర్లతో సమావేశమయ్యారు.
జనగామ బరిలో ఎవరుండాలనే విషయంపై వారి నుంచి అభిప్రాయం తీసుకున్నారు. ఈ సందర్భంగా లీడర్లంతా ముత్తిరెడ్డే ఉండాలని చెప్పారు. కేసీఆర్ టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జనగామ ఎమ్మెల్యే లేకుండా జనగామ కార్యకర్తలతో పల్లా మీటింగ్పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి పరిస్థితులను అధిష్టానం గమనిస్తోందని, టికెట్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ లీడర్లు తననే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు, లీడర్ల మనోభావాలను కేసీఆర్పరిగణనలోకి తీసుకొని తనకే టికెట్కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్అని, అప్పటిదాక పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేయొద్దన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు మధ్యలో ఉన్నాయని, గెలిస్తే అన్నీ పూర్తి చేస్తానని తెలిపారు. సమావేశంలో మున్సిపల్చైర్పర్సన్పోకల జమున, మార్కెట్‌కమిటీ చైర్మన్బాల్దె సిద్ధిలింగం, మున్సిపల్ వైస్‌చైర్మన్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.