తన కూతురు(తుల్జా భవానీ రెడ్డి), అల్లుడు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. కష్టం చేసుకుని బతుకుతున్న తన కూతురిని కొందరు మూర్ఖులు ఆమెను రోడ్డు పాలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలు సమాజానికి మంచిది కాదని.. వారికి అరిష్టం కలుగుతుందని ముత్తిరెడ్డి అన్నారు. అమాయకురాలైన తన కూతురిని అడ్డుపెట్టుకుని అల్లుడిని ప్రేరేపించడం అధర్మమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీతిగా తనను ఎదుర్కోవాలే తప్ప.. నా బిడ్డను, అల్లుడిని ప్రేరేపించడం మంచిది కాదని ముత్తిరెడ్డి తెలిపారు. రాజ్యాంగబద్ధంగా నా బిడ్డను ఏం అనలేని పరిస్థితి లేక.. తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు. ఆ స్థలంలో నా బిడ్డ నిర్మాణం చేసుకుంటానని చెప్పింది. కానీ అలాంటి నా బిడ్డను మీస్ గైడ్ చేసి రోడుపై వేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వారిని భగవంతుడు కూడా క్షమించడని మండిపడ్డారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజాసేవకు భంగం కలగకుండా తాను హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు.