రిటైర్డ్​ ఎంపీడీవో రామక్రిష్ణయ్య హత్యకు ఎమ్మెల్యే ముత్తిరెడ్దిదే బాధ్యత

  • రౌండ్​ సమావేశంలో అఖిల పక్ష నేతలు

జనగామ అర్బన్, వెలుగు :  రిటైర్డ్​ ఎంపీడీవో రామక్రిష్ణయ్య హత్యకు ఎమ్మెల్యే ముత్తిరెడ్దిదే బాధ్యత అని  అఖిల పక్ష నేతలు ఆరోపించారు.   రామక్రిష్ణయ్య హత్యను నిరసిస్తూ ఎంఆర్పీఎస్​, ఎంఎస్​పీ ఆధ్వర్యంలో  గురువారం జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్​ హాల్లో రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  నేతలు మాట్లాడారు.   హత్య కేసులో పాత్రదారులు మాత్రమే ఆరెస్టయ్యారని, సూత్రదారులు, కుట్రదారుల  బయటే ఉన్నారని అన్నారు.

ఈ కేసును హైకోర్టు సిట్టింగ్​ జడ్జి ద్వారా లేదా సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్​ చేశారు.  కార్యక్రమంలో సమావేశంలో ఇనుముల నర్సయ్య, గోవింద్​ నరేశ్​​, రాజారెడ్డి, మోకు కనకారెడ్డి, ఆరుట్ల దశమంతరెడ్డి, మాసాన్​పెల్లి లింగాజీ, డాక్టర్ లక్ష్మినారాయణ నాయక్  పాల్గొన్నారు.