
జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టాయిలెట్లను శుభ్రం చేశారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి... పాఠశాలలో బాత్రూంలు అపరిశుభ్రంగా ఉండటంపై ప్రధానోపాధ్యులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనే స్వయంగా టాయిలెట్స్ శుభ్రం చేశారు.