అధికారంలోకి వచ్చాక చెప్తా.. మంత్రి మల్లారెడ్డికి మైనంపల్లి వార్నింగ్

మేడ్చల్ నియోజకవర్గాన్ని మంత్రి మల్లారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి చెరువులు, కుంటలను కబ్జా చేశారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. మెడికల్ కాలేజీ పేరుతో ఒక కాలేజీ స్టాఫ్ను మరో కాలేజీలో చూపుతూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన నిర్వహిస్తున్న మెడికల్ కళాశాలపై పూర్తి దర్యాప్తు చేపట్టి మూసివేస్తామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో మైనంపల్లి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 

బీఆర్ఎస్  ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఉద్యమకారులకు విలువ లేదన్నారు మైనంపల్లి హన్మంతరావు. తాను తన కొడుకు కోసం పార్టీ మారలేదని స్పష్టం చేశారు. తాను ముక్కు సూటి మనిషినని.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రశ్నించానని గుర్తు చేశారు. . సీఎం కేసీఆర్ సూచన మేరకే తన కొడుకు రోహిత్ ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చానని చెప్పారు. కాంగ్రెస్  తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. కేసీఆర్ గద్దెనెక్కి కూర్చున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టనష్టాలు తెలిసిన వారినే  ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని  కోరారు.   కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో  అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అభిప్రాయపడ్డారు.  

ALSO READ : తిరుపతిలో భారీగా ఎర్రచందనం పట్టివేత.. 15 మంది అరెస్ట్