బోనాల ఉత్సవాలు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావులో జోష్ ను నింపాయి. వేడుక ఏదైనా తనదైన శైలిలో డ్యాన్సులతో అలరించే ఎమ్మె్ల్యే మైనంపల్లి హన్మంతరావు..బోనాల వేడుకల్లోనూ స్టెప్పులేశారు. హైదరాబాద్ బేగంబజార్ లోని బీఆర్ఎస్ నాయకుడు ధన్ రాజ్ ఏర్పాటు చేసిన ఫలహారం బండి ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే హన్మంతరావు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే హన్మంతరావును ధన్ రాజ్ శాలువాతో సత్కరించారు.
ఆ తర్వాత ఫలహారం బండి ఊరేగింపులో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి తీన్మార్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇతర కార్యకర్తలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు. మైనంపల్లి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.