- అల్వాల్ లో గద్దర్ విగ్రహావిష్కరణ
అల్వాల్, వెలుగు: ప్రజా గాయకుడు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహాన్ని అల్వాల్‌లోని యాదమ్మనగర్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజా గాయకుడు గద్దర్ సమాజాన్ని చైతన్య పరచడంలో చేసిన కృషి, తెలంగాణ ఉద్యమానికి అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పదని కొనియాడారు.
యాదమ్మ నగర్లో పెద్ద ఎత్తున నివసించే మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రజలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారని గుర్తుచేశారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే మైనంపల్లి సూచించారు.