
రామాయంపేట, వెలుగు: పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. బుధవారం రామాయంపేటలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భేటీ బచావో–భేటీ పడావో కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సైన్స్ ఫేర్ లో ప్రదర్శించిన ప్రాజెక్టులను పరిశీలించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
పాపన్నపేట, వెలుగు: పొడ్చన్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మత్స్య సహకార భవనాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను చాలావరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు కేటాయిస్తున్నామని చెప్పారు. కొత్తపల్లిలో ఇటీవల చనిపోయిన త్యార్ల సుజాత సంస్మరణ సభకు హాజరై, నివాళి అర్పించారు. నిరుపేద మహిళలకు చీరలు వంపిణీ చేశారు. కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం చైర్మన్ రమేశ్, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మండల అధ్యక్షుడు గోవింద నాయక్ ఉన్నారు.
రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. లకడారం, ముత్తంగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తోందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రుద్రారం పీఏసీఎస్చైర్మన్పాండు, ముత్తంగి పీఏసీఎస్ చైర్మన్భిక్షపతి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
గుమ్మడిదలలో..
గుమ్మడిదల రైతు వేదిక వద్ద, అన్నారం, కొత్తపల్లి, నల్లవల్లి, కానుకుంట, రాంరెడ్డి బావి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
జిన్నారం, ఊట్ల గ్రామాల్లో..
జిన్నారం, వెలుగు: జిన్నారం, ఊట్ల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, ఏపీఎం నరేందర్ కుమార్ బుధవారం ప్రారంభించారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, సీసీ సుజాత, నాయకులు పాల్గొన్నారు.