
మెదక్‌టౌన్, వెలుగు: నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. శనివారం ఆయన మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో స్టూడెంట్స్‌ను ముంచే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. 2022 –23 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ.1.70 కోట్ల స్కాలర్షిప్డబ్బులు ఉప ముఖ్యమంత్రి భట్టి చొరవతో మంజూరయ్యాయని పేర్కొన్నారు.
దీంతో జిల్లాలో 3 లక్షల 4 వేల మంది స్టూడెంట్స్‌కు లబ్ధిచేకూరుతుందన్నారు. అలాగే జిల్లాలో బీసీ, ఎస్సీ కోటా కింద 3 లక్షల 4 వేల మంది స్టూడెంట్స్‌కు రూ.1 కోటి 70 లక్షలు వారి ఖాతాలలో జమ అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు.