ఇందిరమ్మ రాజ్యంలో సబ్బండ వర్గాలకు న్యాయం : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావు

ఇందిరమ్మ రాజ్యంలో సబ్బండ వర్గాలకు న్యాయం : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావు
  • బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం చారిత్రాత్మకం
  • మెదక్​ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​ రావు

మెదక్​ టౌన్​, వెలుగు : రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు చారిత్రాత్మకమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు పేర్కొన్నారు. ఎన్నో  ఏండ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం  ఇందిరమ్మ రాజ్యంలో సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందనడానికి నిదర్శనమన్నారు.

 బుధవారం మెదక్ టౌన్ లోని రాందాస్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలకు పాలాభిషేకం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్నివర్గాలకు సమన్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో  ప్రజాపాలన కొనసాగుతుందన్నారు.

ఒకే రోజు రెండు చారిత్రాత్మక బిల్లులను ఆమోదించడం ద్వారా దేశానికి ఆదర్శం గా నిలిచారన్నారు.  హావేళీ ఘనపూర్​మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్​లో కల్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్​ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు బొజ్జ పవన్, గూడూరి ఆంజనేయులు, జీవన్ రావు, శ్రీనివాస్​ చౌదరి, సుప్రభాత్ రావు, యాదగిరి, రమేశ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

జర్నలిస్టులకు ఎల్లప్పుడు అండగా ఉంటా..

మెదక్ ​జిల్లా కేంద్రంలో ప్రెస్​క్లబ్​ కొత్త భవన నిర్మాణంతో జర్నలిస్టుల కల సాకారమైందని, ఎల్లప్పుడు తన సహకారం ఉంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు పేర్కొన్నారు. మెదక్​టౌన్ లోని ధ్యాన్​చంద్​చౌరస్తాలో కొత్తగా నిర్మించిన ప్రెస్​క్లబ్​భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

అనంతరం ఎమ్మెల్యే రోహిత్​రావును జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. మెదక్​ ప్రెస్​క్లబ్​ ప్రెసిడెంట్​దొంతి నరేశ్​, ప్రధాన కార్యదర్శి ఎర్ర ప్రసాద్​, వర్కింగ్​ప్రెసిడెంట్ నర్సింహాచారి, జర్నలిస్టులు శ్రీధర్, శంకర్​దయాళ్, బండ నరేశ్, శరత్​చంద్ర, సంగమేశ్వర్, శ్రీహరి, బీవీకే రాజు, పలువురు జర్నలిస్టులు, అధికారులు, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.