
వర్ధన్నపేట, వెలుగు: భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణ కళారంగంతోనే సాధ్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. వరంగల్జిల్లా వర్ధన్నపేటలో మహాశివరాత్రి పుస్కరిచుకుని భారతీయ నాటక కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 51వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే విజయం సాధించిన నాటికలకు బహుమతులు ప్రదానం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట భారతీయ నాటక కళాసమితి విశిష్ట సేవల అందిస్తూ 50 ఏండ్లుగా కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అంతరించిన పోతున్న నాటక రంగానికి భారతీయ నాటక కళాసమితి జీవం పోస్తున్నదన్నారు. అనంతరం చిన్నారులు వేసిన నృత్యప్రదర్శన ప్రేక్షులను ఆకట్టుకుంది. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టరేట్ పొందిన వర్ధన్నపేట చెన్న ప్రవీణ్‌తోపాటు ఎస్ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత సామాజికవేత్త పరిపాటి శ్రీనివాస్‌ను ఘనంగా సన్మానించారు.