వరంగల్: బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన బీఆర్ఎస్ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని మడికొండ పీఎస్‌లో ఆయన ఇవాళ (అక్టోబర్ 2) కంప్లైంట్ ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టుల కోసం కొంతమందిని నియమించుకుని ప్రజాప్రతినిధులను ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులను ఎమ్మెల్యే నాగరాజు కోరారు.
ALSO READ | కొండా సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి:జగ్గారెడ్డి
కాగా, ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మెడలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు నూలు దండా వేశారు. ఈ సీన్‌ను కొందరు సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. మహిళా మంత్రి అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోలింగ్ చేస్తు్న్నారని కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.