బీఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పార్క్ ల్యాండ్ పై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ నేతలు పదేళ్లు శవాలపై పేలాలు ఏరుకున్నారని విమర్శించారు. అక్రమంగా స్థలం కబ్జా చేసి హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ కోసం స్థలం కేటాయించింది వేరే చోట అయితే నిబంధనలకు విరుద్ధంగా క్యాంప్ ఆఫీస్ పక్కన స్థలాన్ని కబ్జా చేసి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కట్టారని ఆరోపించారు. సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని చెప్పారు. అనుమతులు లేకుండానే అక్రమంగా భవనం నిర్మించారని ఇంటి నెంబర్ లేకుండానే విద్యుత్ శాఖ మీటర్ కేటాయించిందని పేరు TRS... తండ్రి పేరు BRS పేరు తో విద్యుత్ మిటర్ తీసుకున్నారని చెప్పారు.
ఇప్పటికైనా పార్క్ కార్యాలయం లో కట్టిన పార్టీ ఆఫీస్ ఖాలి చేయాలని డిమాండ్ చేశారు. మీకు కేటాయించిన స్థలంలో పార్టీ ఆఫీస్ కట్టుకోవాలని సూచించారు నాయిని రాజేందర్ రెడ్డి