వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం :  ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం :  ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ సిటీ, వెలుగు : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం న్యూ బస్టాండ్ రోడ్ హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమకొండ 10వ డివిజన్ లో  రూ.3.5 కోట్లతో చేపట్టిన స్మార్ట్ సిటీ రోడ్లు, డ్రైనేజీ పనులకు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లుతో కలిసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.