
వరంగల్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా గ్రేటర్, వరంగల్ జిల్లా అభివృద్ధికి సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డిని కోరారు. నగరంలోని స్మార్ట్ సిటీ పనులకు మరిన్ని నిధులు కేటాయించాలని, పెండింగ్ బిల్స్ ఇప్పించాలని, గత పర్యటనలో వెయ్యిస్తంభాల గుడి వద్ద కలిసి అభివృద్ధిపై వినతిపత్రం అందించామని గుర్తుకు చేశారు. ఈసారైనా స్పందించి సహకరించాలని వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నేతలు బత్తిని శ్రీనివాస్, ఈవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మురికివాడలు లేని సుందర నగరమే ధ్యేయం
గ్రేటర్ వరంగల్ నగరంలో మురికి వాడలు లేకుండా సుందరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డ, జ్యోతిబసు కాలనీ, యాదవనగర్ కాలనీల్లో పర్యటించారు. అభివృద్ధి పనులు, జనాల సమస్యలను పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రాజేందర్, కుమార్ యాదవ్, శ్రీధర్ యాదవ్, అంబేద్కర్ రాజు, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, తోట రమేశ్ తదితరులు పాల్గొన్నారు.