హాలియా, వెలుగు: కాంగ్రెస్ డబ్బు సంచులతో కుట్రలు చేస్తోందని నాగార్జున ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. గురువారం నల్లగొండ జిల్లా హాలియాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా చేయాలని అభివృద్ధిని తాను రెండున్నరేండ్లలో చేశానన్నారు. సీఎం కేసీఆర్ మేనిఫెస్టో లో లేని పథకాలను కూడా అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు.
ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఎన్నికల మేనిఫెస్టో పాంప్లేట్స్ ను విడుదల చేశారు. ఆయన వెంట ఎన్నికల ఇన్చార్జ్ రామచంద్రనాయక్, రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజేందర్ రెడ్డి, జడ్పీటీసీ అబ్బీడి కృష్ణా రెడ్డి, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, మార్కెట్ చైర్మన్లు జవాజీ వెంకటేశ్వర్లు, మర్ల చంద్రా రెడ్డి, పాక్స్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు.