న్యూడ్ కాల్స్.. బీ అలెర్ట్.. బాధితుల్లో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే !

న్యూడ్ కాల్స్.. బీ అలెర్ట్.. బాధితుల్లో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే !

* అర్ధరాత్రి పూట కాల్ చేసిన మహిళ
* ఏపీ హైకోర్టు లాగిన్లోకి న్యూడ్ కాలర్ ఎంట్రీ 
* అప్రమత్తమైన అధికారులు.. కేసు నమోదు
* ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికీ తప్పని తిప్పలు

కరీంనగర్ జిల్లా
అర్ధరాత్రి 12 దాటింది.. అప్పటి వరకు సందర్శకులతో బిజీబిజీగా గడిపిన ఎమ్మెల్యే నిద్రలోకి జారుకున్నారు. అదే సమయంలో సెల్ మోగింది...! ఇంత రాత్రి పూట కాల్.. ఎవరైనా ఆపదలో ఉన్నారేమో అనుకొని కాల్ లిఫ్ట్ చేశారు. అది వీడియో కాల్.. ఫోన్‌ స్క్రీన్‌పై ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే కాల్‌ను కట్‌ చేశారు.  

అమరావతి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రోజు వారీ వ్యవహారాలతో బిజీబిజీగా ఉంది. కోర్టు హాళ్లలో హియరింగ్స్ జరుగుతున్నాయి. కిట్టు అనే పేరుతో ఓ వ్యక్తి మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ యాప్‌ లో 17వ నంబర్ కోర్టు ఆన్ లైన్ విచారణలోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. స్క్రీన్ పై నగ్నంగా కనిపించాడు. బట్టలు లేకుండా మంచంపై పడుకుని మాట్లాడుతూ కోర్టు కార్యకలాపాలకు విఘాతం కలిగించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని బ్లాక్‌ చేశారు. 

హైదరాబాద్   
ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. పదవీ విరమణ పొంది ఇంటి వద్దే ఉంటున్నారు. గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఎవరైనా బంధువై ఉంటారని కాల్ కు ఆన్సర్ చేశారు.. స్క్రీన్  పై ఓ మహిళ నగ్నంగా కనిపించింది. సదరు అధికారిని బట్టలు విప్పేయాలని కోరింది. ఆయన  నిరాకరించి డిస్ కనెక్ట్ చేశారు. మరుసటి రోజు ఆయన ఫొటోను మార్ఫింగ్ చేసి న్యూడో వీడియోను వాట్సప్ లో పంపారు. 25 వేలు పంపకుటే అల్లరి చేస్తానని బెదిరిస్తూ మెస్సేజ్.. 

సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు.. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కోర్టులు అందరూ బాధితులే.. సామాన్యుడి నుంచి పొలిటీషియన్స్ దాకా అందరినీ ఇబ్బంది పెడుతూ డబ్బులు గుంజేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14 ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే బాధితుల జాబితాలో చేరిపోయారు. అర్ధరాత్రి గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన ఆయన షాక్ కు గురయ్యారు. వెంటనే డిస్ కనెక్ట్ చేసేశారు. వెంటనే నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫోన్‌నంబర్‌ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తన ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు బ్లాక్‌మెయిల్‌ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారా.? అనే సందేహాన్ని సదరు ఎమ్మెల్యే వక్తం చేస్తున్నారు. 

ఏపీ హైకోర్టు కు సైతం  ఇదే సమస్య ఎదురైంది.  ఈ నెల15వతేదీన కిట్టు అనే వ్యక్తి పేరుతో ఓ వ్యక్తి  మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ యాప్‌ ద్వారా 17వ కోర్టులోకి జొరబడ్డాడు. బట్టలు లేకుండా మంచంపై పడుకుని మాట్లాడుతూ కోర్టు కార్యకలాపాలకు విఘాతం కలిగించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ వ్యక్తిని బ్లాక్‌ చేశారు. ఘటనపై హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్ ఏడుకొండలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్లో ఓ మాజీ ఐఏఎస్ అధికారికీ ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయనకు ఓ వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేశారు. అవతలి వైపు నగ్నంగా ఉన్న ఓ మహిళ కనిపించింది. బట్టలు విప్పేయాలని కోరింది. దానికి నిరాకరించిన ఆయన కాల్ కట్ చేశాడు. ఇంకేముంది.. తెల్లవారే సరికి ఆయన వాట్సాప్ కు ఓ వీడియో వచ్చింది. అందులో ఆయన ఓ మార్ఫింగ్ వీడియోకు సదరు మాజీ ఐఏఎస్ అధికారి ఫొటోను యాడ్ చేశారు. 

అర్జంటుగా రూ. 25 వేల రూపాయలు పంపాలని లేకుంటే రచ్చ చేస్తామని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. అంతే కాకుండా కాంటాక్ట్ జాబితాలో ఉన్న వాళ్లందరికీ పంపుతామంటూ హెచ్చరించారు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన సెప్టెంబర్ 5వ తేదీన చోటు చేసుకుంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ లిఫ్ట్ చేయాల్సి వస్తే ముఖం కనిపించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే ఆలస్యం చేయకుండా సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.