- యూపీలోని ఖుషీనగర్ ఎమ్మెల్యే పీఎన్ పాఠక్
ధర్మపురి, వెలుగు : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఉత్తరప్రదేశ్ లోని ఖుషీనగర్ ఎమ్మెల్యే పి.ఎన్పాఠక్ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ పథకాలకు నిధులు కేటాయిస్తున్నా సదరు స్కీమ్స్ఫ్లెక్సీల పై ప్రధాని ఫొటో వేయకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కస్తూరి సత్యం, రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడ సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం, స్టేట్ స్వచ్ఛభారత్ కన్వీనర్ మంచె రాజేశ్, ఎస్సీ మోర్చా కన్వీనర్ ఓరగంటి చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం, పిల్లి శ్రీనివాస్, లవణ్, మండల అధ్యక్షులు చక్రపాణి, గంగుల కొమురెల్లి, సంగెం గంగారం పాల్గొన్నారు.