హుజూరాబాద్, వెలుగు : తనను గెలిపించడానికి మీరందరూ కష్టపడ్డారని, మీ అందరి బాగు కోసం కృషి చేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం టౌన్ సెంటర్లో బీఆర్ఎస్ సర్పంచులను సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ తన గెలుపు వెనుక ప్రతి సర్పంచ్ కష్టం ఉందని, తన కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను వీడేదిలేదన్నారు.
ప్రజల తీర్పును గౌరవించి రానున్న రోజుల్లో కలిసికట్టుగా ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జడ్పీ చైర్ పర్సన్ కె.విజయ, ఎంపీపీలు రేణుక, మమత, రాణి, పావని, జడ్పీటీసీలు బక్క రెడ్డి, సాధవరెడ్డి, కల్యాణి, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, లీడర్లు బాలకిషన్ రావు, సత్యనారాయణ రావు. తదితరులు పాల్గొన్నారు.