- మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి
భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు అందించాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. మంగళవారం హవేలీఘన్పూర్మండల కేంద్రంలో గండిపడ్డ పెద్ద చెరువు, నీట మునిగిన పొలాలను పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం వల్ల రాష్ట్రంలో 32 మంది చనిపోయారని వర్షాల వల్ల ఆస్తి, పంట, ప్రాణ నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రతిపక్షాలను తిట్టడంలో మునిగిందన్నారు. తెగిపోయిన ఘనపూర్ పెద్ద చెరువు కట్టను పునరుద్ధరించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
స్పందించకపోతే తామే గ్రామస్తులతో కలిసి కట్టను పూడ్చుకుంటామని చెప్పారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, లావణ్య, కిష్టయ్య, సాయిలు, రామచంద్ర రెడ్డి, సతీశ్ రావు, నరేందర్ రెడ్డి ఉన్నారు.