
మెదక్ టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచిన సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో మెప్మా ఉద్యోగస్తులకు రూ.4 వేలు వేతనం ఉండగా వారి శ్రమను గుర్తించిన సీఎం కేసీఆర్ రూ.6 వేలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, నాయకులు అశోక్ పాల్గొన్నారు.