
రామాయంపేట, వెలుగు: పదేళ్ల కాలంలో రామాయంపేట పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆమె రామాయంపేట మున్సిపల్ పరిధిలోని కేసీఆర్ కాలనీతో పాటు 3, 4, 5 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రామాయంపేట అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు.
ఇళ్లు లేని నిరుపేదల కోసం 300 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణం చేసి పంపిణీ చేసినట్టు తెలిపారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పాటు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సైతం మంజూరు చేసి విషయాన్ని గుర్తు చేశారు. తనను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఇక్కడి ప్రజల అవసరాల గురించి కాంగ్రెస్ అభ్యర్థికి ఎలాంటి అవగాహన లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బాదే చంద్రం, గజవాడ నాగరాజు, కొండల్ రెడ్డి పాల్గొన్నారు.
ALSO READ: హరీశ్‌రావును చూస్తే .. అబద్ధాలు ఆత్మహత్య చేసుకుంటాయ్ : తీన్మార్ మల్లన్న