పేదల కల నిజం చేసిన కేసీఆర్ : పద్మా దేవేందర్​ రెడ్డి

పేదల కల నిజం చేసిన కేసీఆర్ :  పద్మా దేవేందర్​ రెడ్డి

రామాయంపేట, వెలుగు: సీఎం కేసీఆర్​పేదలకు డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు కట్టించి సొంతింటి కలను నిజం చేశారని బీఆర్‌‌ఎస్​మెదక్​ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి అన్నారు.  సోమవారం పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఆశయంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చామన్నారు. రామాయంపేట పట్టణ అభివృద్ధికి సీఎం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

రెవెన్యూ డివిజన్​, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కేటాయించారన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ  బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని, ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ జితేందర్ గౌడ్​, వైస్​ చైర్మన్​ విజయలక్ష్మి, కౌన్సిలర్​ యాదగిరి, నాగరాజు పాల్గొన్నారు.

మెదక్ పట్టణంలో..

మెదక్ పట్టణంలోని వివిధ వార్డుల్లో కూడా పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు చెందిన మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి భర్త అమృత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఏఎంసీ చైర్మన్  జగపతి పాల్గొ