హుజూర్ నగర్, వెలుగు : కాంగ్రెస్ కు కార్యకర్తలే బలమని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ లో క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కోడి ఉపేందర్, గంజి శివ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్చేసి ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కార్యకర్తలేనన్నారు.
వేడుకల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గెల్లి అర్చనారవి, నాయకులు చిట్యాల అమర్నాథరెడ్డి, జక్కుల నరేందర్, బంక శ్రీనివాసరెడ్డి, బచ్చలకూరి బాబు, కుక్కడపు మహేశ్, యోహాన్, సతీశ్, భాస్కర్, విజయ్, ముస్తఫా, క్రాంతి, రాము పాల్గొన్నారు.