
- ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి
కోదాడ, వెలుగు : కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆస్పత్రి అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఖాళీ గా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో ఈ ఆస్పత్రిలోనే ట్రామా కేర్ సెంటర్ ను ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు కోదాడలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం కోదాడ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్ దశరథ నాయక్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఎంపీవో కుటుంబానికి పరామర్శ
మునగాల, వెలుగు : మునగాల ఎంపీవో డాక్టర్ ధారాశ్రీనివాస్ గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాస్ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.