ఆర్మూర్, వెలుగు: తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఉద్ధేశించి ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన ఆర్మూర్ మండలం అంకాపూర్, మాక్లూర్ లో క్వారీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తనను చంపుతానని వారం రోజుల నుంచి సుమారు వంద కు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని, విదేశాల నుంచి కూడా బెదిరింపు కాల్స్చేస్తున్నారన్నారు. ప్రజల కోసం తాను చావడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోరుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.