అంకాపూర్​ లో పీహెచ్​సీ స్థలాన్నిపరిశీలించిన ఎమ్మెల్యే

అంకాపూర్​ లో పీహెచ్​సీ స్థలాన్నిపరిశీలించిన ఎమ్మెల్యే

ఆర్మూర్​, వెలుగు : ఆర్మూర్​ మండలం అంకాపూర్​ గ్రామంలో ప్రైమరీ హెల్త్​ సెంటర్​ కోసం శుక్రవారం ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. హెల్త్​ సెంటర్​  ఏర్పాటైతే గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల పల్లెల జనానికి వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు.  త్వరలో హెల్త్​ సెంటర్​ ఏర్పాటుకు నిధులు మంజూరవుతాయన్నారు. ఎమ్మెల్యే వెంట పంచాయతీ సెక్రటరీ హారిక, మండల సర్వేయర్  రత్నాకర్, అర్ఐ దశరథ్ తదితరులు ఉన్నారు.