- కేంద్ర మంత్రిని కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్‌కు ఇంటిగ్రేటెడ్మోడల్స్కూల్మంజూరు చేయించాలని ఆర్మూర్ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిని కలిసి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఆర్మూర్‌కు రావాల్సి ఉండగా.. ఖమ్మం జిల్లా మధిరకు కేటాయించారని మంత్రికి వివరించి మెమోరాండం అందజేశారు.
మూడో పైలెట్ ప్రాజెక్టులో ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రిని ఎమ్మెల్యే కోరారు.