చిలుకూరు ఆలయ పూజరిని పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

చిలుకూరు ఆలయ పూజరిని పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

ఆర్మూర్​, వెలుగు :  ఇటీవల చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్​పై దాడి జరుగగా గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి వెళ్లి పూజారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

హిందూ ఆలయాలు, పూజరులపై దాడులు చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి  ఘటనలకు బీజేపీ  వ్యతిరేకమని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.