- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవ పోరాటమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం అఖిల పక్ష జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, బీజేపీ నేతలు కే.వీ ఎల్ఎన్ రెడ్డి, సురేశ్‌గౌడ్ తో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..చేర్యాల పోరాట గడ్డకు ఓ చరిత్ర ఉందన్నారు. అందెశ్రీ లాంటి కవులు, బిఎస్ ప్రసాద్ లాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన గడ్డకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి రెవెన్యూ డివిజన్ కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ మీటింగ్ లో దీని గురించి ప్రస్తావించానన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే బడ్జెట్ సెషన్స్ లో చేర్యాల రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడతానని, తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు.
ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ నర్సయ్య పంతులు, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, టీఎస్ ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.