
చేర్యాల, వెలుగు: మనోచేతన దివ్యాంగుల స్కూల్అందిస్తున్న సేవలు అభినందనీయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కొనియాడారు. సోమవారం మండల కేంద్రంలోని మనోచేతన దివ్యాంగుల స్కూల్లో దాత ఇప్ప నిషికాంత్రెడ్డితో కలిసి స్టూడెంట్స్కు దుస్తుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానసిక వికలాంగులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని, వారికి సమాజంలో గుర్తింపు వచ్చే విధంగా చేయూతనందించాలని పిలుపునిచ్చారు. అనంతరం దొమ్మాట గ్రామంలోని రామాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.