జనగామ, వెలుగు: జిల్లా కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. జనగామ మండలానికి చెందిన 82 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.లక్షా 116 చొప్పున రూ.82 లక్షల 9 వేల 512 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, తహసీల్దార్ వెంకన్న, ఆర్ఐ అన్వేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.