నా జీతమంతా ప్రజల కోసమే ఖర్చు చేస్తా : పల్లా రాజేశ్వర్​రెడ్డి

నా జీతమంతా ప్రజల కోసమే ఖర్చు చేస్తా : పల్లా రాజేశ్వర్​రెడ్డి

చేర్యాల, వెలుగు: తన జీతమంతా జనగామ నియోజక వర్గ ప్రజల కోసమే ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల, మద్దూరు మండల కేంద్రాల్లో  బీఆర్ఎస్​ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి రాకముందే ఆస్తులు సంపాదించానని, ఇప్పుడు కొత్తగా సంపాదించేది ఏమీలేదన్నారు. 5ఏళ్లపాటు సేవ చేస్తా తప్ప ఎలాంటి భూములు,  ఆస్తులు కొనబోనని చెప్పారు. ప్రతి వారం జనగామలో 3రోజులు, చేర్యాలలో 3 రోజులు ఉండి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు.  

తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా పర్వాలేదని, తాను స్వచ్ఛందంగా పనిచేస్తానన్నారు. తనను  ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించిన జనగామ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.  సమావేశంలో ఎంపీపీలు ఉల్లంపల్లి కర్నాకర్, కృష్ణారెడ్డి, కీర్తన, సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు ఎల్లారెడ్డి, మున్సిపల్​చైర్ పర్సన్​స్వరూపరాణి, వైస్​ చైర్మన్​రాజీవ్​రెడ్డి, మార్కెట్ చైర్మన్​ మల్లేశం గౌడ్​, కౌన్సిలర్లు నరేందర్​, జువేదా, కనకమ్మ, సతీశ్​ గౌడ్​, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, గీస భిక్షపతి, నాగేశ్వర్​రావు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.