సీసీఐ కొనుగోళ్లతో పత్తికి మద్దతు ధర

సీసీఐ కొనుగోళ్లతో పత్తికి మద్దతు ధర
  • భైంసా మార్కెట్‌లో కొనుగోళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ 

భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోళ్లను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్  ప్రారంభించారు.  ప్రధాని మోదీ హయాంలో పంటలకు మద్దతు ధరలు పెరిగాయన్నారు.  పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకే  కేంద్రం ద్వారా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. 12 తేమ శాతం ఉంటే క్వింటాలుకు రూ. 7521 ధర ఇస్తారన్నారు.

 అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్ మాట్లాడుతూ..  రైతుల సమస్య ల పరిష్కారం కోసం మార్కెట్ కమిటీ పాలక వర్గం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్,  డైరెక్టర్లు, నాయకులు, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధి కి కృషి

కుంటాల, వెలుగు: భైంసా నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి కృషి చే స్తానని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.  సోమవారం కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించనున్న  టెంపుల్ ప్రహరీ గోడ, కళా తోరణం నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.  భైంసా ఏఎమ్‌సీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, నాయకులు పాల్గొన్నారు.