భైంసా, వెలుగు: గోసంరక్షణ కోసం ప్రతి హిందువు పాటుపడాలని ముథోల ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సంరక్షణ సంస్థ విరాళాలతో భైంసాలోని గోశాలలో నిర్మించిన షెడ్డు, గోశాల ఆఫీస్‌ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తల్లి లాంటి గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గో సంరక్షణ కోసం 390 ఎకరాల భూమిని దానం చేసిన సామ్ చెనయ్ ను నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని కొనియాడారు.
గోశాల భూముల పరిరక్షణకు కంచె ఏర్పాటు చేయడానికి నిధులు ఇస్తానని, దాతల సాయంతో గోశాల భూములను సంరక్షించుకుందామన్నారు. కార్యక్రమంలో భైంసా సీఐ రాజారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బి.గంగాధర్, పారిశ్రామికవేత్త నాగ్ నాథ్ పటేల్, ఆర్ఎస్ఎస్ బాధ్యులు సాదూల కృష్ణదాస్, గోసంరక్షణ సమితి బాధ్యులు నిమ్మల ప్రవీణ్, సిందే లక్ష్మణ్ పటేల్, నంగి దత్తు తదితరులు పాల్గొన్నారు.