లోకేశ్వరం మండలం పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ.18 కోట్లివ్వండి : శాసనసభలో ఎమ్మెల్యే రామారావు

లోకేశ్వరం మండలం పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ.18 కోట్లివ్వండి : శాసనసభలో ఎమ్మెల్యే రామారావు

భైంసా, వెలుగు: లోకేశ్వరం మండలం పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్​కు అదనంగా రూ.18 కోట్ల నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శాసనసభలో కోరారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడారు. లిఫ్ట్ ​పనులు పూర్తయితే  4200 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

పిప్రి, మొల, నగర్, ధర్మోరా, బాగాపూర్, రాయపూర్ కాండ్లి, లోకేశ్వరం, నగర్ తండాతో పాటు, పలు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఎలక్ట్రికల్ పనులు మినహా అన్ని పనులు పూర్తయ్యాయని, ఇందుకు వెంటనే రూ.18 కోట్లు విడుదల చేయాలని కోరారు.