ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి : ఎమ్మెల్యే పాయల్‌‌‌‌ శంకర్​

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి : ఎమ్మెల్యే పాయల్‌‌‌‌ శంకర్​

కరీంనగర్ సిటీ, వెలుగు: ఎమ్మెల్సీగా ఒకసారి చాన్స్ ఇవ్వాలని, బీజేపీ క్యాండిడేట్లను గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల స్టేట్ కో – ఆర్డినేటర్  రామచందర్‌‌‌‌‌‌‌‌రావు, ఆదిలాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ విద్యానగర్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఆఫీస్‌‌‌‌ను ఆదివారం పార్టీ ఆర్గనైజింగ్‌‌‌‌ సెక్రటరీ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ జీతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. 

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో గెలిచిన అభ్యర్థులు సమస్యల పరిష్కారానికి కొట్లాడారా..? అని ప్రశ్నిం చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పే చాన్స్ వచ్చిందని, బీజేపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిని, టీచర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలపై  బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొన్నారు.